ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలుచోట్ల డీజిల్ కొరత ఏర్పడింది. దీంతో పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు బారులు తీరాయి. డీజిల్ కొరత కారణంగా మరికొన్నిచోట్ల బంకులనే మూసివేసే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏపీ పౌరసరఫరాల శాఖ రంగంలోకి దిగింది. పెట్రోలియం ట్రేడర్స్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో చర్చించింది. దీంతో ప్రస్తుత డిమాండ్‌కు అదనంగా 10 శాతం ఇంధన సరఫరా చేసేందుకు ఆయిల్ కంపెనీలు అంగీకరించినట్లు పెట్రోలియం ట్రేడర్స్ వెల్లడించింది. త్వరలోనే అన్ని బంకులలో సాధారణ పరిస్థితి నెలకొంటుందని వెల్లడించింది.