CV Anand on DJ Ban: హైదరాబాద్‌లో డీజేల సౌండ్లు, వాడకంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అధ్యక్షతన కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. అన్ని రాజకీయ పార్టీల నేతలతో పాటు మత సంఘాల నేతలు కూడా హాజరయ్యారు. అయితే.. నగరంలో మతపరమైన కార్యక్రమాల్లో డీజేల సౌండ్లు, నృత్యాలు రోజు రోజుకు శ్రుతి మించుతున్నాయని.. దానివల్ల సామాన్య ప్రజల నుంచి చాలా ఫిర్యాదులు వస్తున్నాయని సీపీ సీవీ ఆనంద్ చెప్పుకొచ్చారు.