హైదరాబాద్‌లో గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల కోసం తెలంగాణ సర్కార్, జెప్టో కలిసి 5 ప్రగతి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాయి. గిగ్ వర్కర్లు విశ్రాంతి తీసుకునేందుకు నీడ, శుభ్రమైన తాగునీరు, టాయిలెట్లు, ఫస్ట్ ఎయిడ్, మొబైల్ ఛార్జింగ్, వైఫై వంటి సదుపాయాలు కల్పించనున్నారు. ఎప్పటికప్పుడు ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించడంతో పాటు అర్హులైన కార్మికులకు ఈ-శ్రమ్ రిజిస్ట్రేషన్‌పై అవగాహన కల్పించనున్నారు. నిధులు, నిర్వహణ బాధ్యతను జెప్టో చేపట్టనుంది.