డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో మన్యం జిల్లా పెదపెంకిలో ఏళ్లనాటి సమస్యకు పరిష్కారం దొరకనుంది. పెదపెంకిలో చేపట్టిన అభివృద్ధి పనులు తుదిదశకు చేరుకున్నాయి. 27 సిమెంటు రోడ్లు, 6 సిమెంటు డ్రెయిన్ల నిర్మాణం పూర్తయ్యింది. 41 మ్యాజిక్ డ్రెయిన్లు ఏర్పాటు చేశారు. 3 వేలకు పైగా మొక్కలతో సుందరీకరణ పనులు చేపట్టారు. దశాబ్దాల బోదకాలు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామస్తుల వ్యక్తిగత హెల్త్ ప్రొఫైల్స్ ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయనున్నారు.