హైదరాబాద్ నగరంలో గాలి కాలుష్యం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ దారుణంగా పెరిగిపోతుంది. నగరంలో తక్షణమే గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. లేకపోతే ఢిల్లీ లాంటి పరిస్థితులు నగరంలోనూ తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నగరంలో జీవించటం కూడా కష్టమవుతుందని అంటున్నారు.