పొరుగు రాష్ట్రాలలో కురుస్తున్న కుంభవృష్టి వల్ల కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఈ జల ప్రవాహం జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు పోటెత్తడంతో.. జలాశయం నిండుకుండలా మారింది. నీటిని దిగువకు విడుదల చేసే క్రమంలో డ్యామ్ 9వ గేట్ రోప్ తెగిపోయిన ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో పాటు మరో రెండు రోప్స్ బలహీనపడటం స్థానిక ప్రజానీకంలో, ఆయకట్టు రైతులలో భయాందోళనలు సృష్టిస్తోంది. ఊహించని ప్రమాదం పొంచి ఉందనే భయం వారిని వెంటాడుతోంది.