ఓ వ్యక్తి కారు డ్రైవింగ్ నేర్చుకుంటుండగా కారు చెరువులోకి దూసుకెళ్లింది. డ్రైవింగ్ నేర్చుకుంటున్న వ్యక్తి, నేర్పుతున్న వ్యక్తి ఇద్దరూ కారులోనే చిక్కుకుపోయారు. స్థానికులు గమనించి వారికి సాయం చేయడంతో ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన జనగామ పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. అయితే చెరువులోకి కారు దూసుకెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.