చాలా మంది మహిళలకు స్వయం సహాయక సంఘాలలో చేరే విధానం తెలియదు. ఆధార్ కార్డు కలిగి ఉండి.. 15-65 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళలు 10 మంది కలిసి ఒక సంఘంగా ఏర్పడవచ్చు. దివ్యాంగులైతే 5గురు చాలు. సంఘం పేరుతో బ్యాంకు ఖాతా తెరవాలి. అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకోవాలి. తీర్మానం చేసి బ్యాంకు.. ఐకేపీ/మెప్మా అధికారులకు ఇవ్వాలి. కొత్త సంఘాలకు రూ. లక్ష నుండి రూ. 20 లక్షల వరకు రుణం లభిస్తుంది.