ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై చర్చించారు. ఈ క్రమంలోనే రైల్వే శాఖ మంత్రితో భేటీ అయిన పవన్ కళ్యాణ్.. పలు రైల్వే ప్రాజెక్టులపై అశ్వినీ వైష్ణవ్‌తో చర్చించారు. అలాగే పిఠాపురం పరిధిలో రైల్వే ఓర్ బ్రిడ్జి నిర్మించాలని.. నాలుగు ముఖ్మమైన రైళ్లకు పిఠాపురం రైల్వే స్టేషన్‌లో హాల్ట్ ఇవ్వాలని కోరారు. పిఠాపురంలోని పాదగయ క్షేత్రానికి భక్తుల రద్దీ పెరుగుతోందన్న పవన్ కళ్యాణ్.. వారి సౌకర్యం కోసం నాలుగు రైళ్లు ఆపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.