ఒక తండ్రి చేసిన చిన్న తప్పుకు అతని కూతురు బలైంది. ఏమాత్రం సంబంధంలేని వ్యవహారంలో అవమానాలు, వేధింపులకు గురవటంతో.. తీవ్ర మనస్తానానికి గురై.. కఠిన నిర్ణయం తీసుకుంది. ఓ కానిస్టేబుల్, అతని భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ సెల్ఫీ వీడియో తీసుకుని మరీ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని నాచారంలో జరగ్గా.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.