Sub inspector dies by suicide at Tanuku police station: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎస్ఐ ఆత్మహత్య కలకలం రేపింది. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా పనిచేస్తున్న మూర్తి ఆత్మహత్య చేసుకున్నారు. మూర్తిపై ఆరోపణలు రావటంతో ఉన్నతాధికారులు ఇటీవల సస్పెండ్ చేశారు. అయితే తణుకు రూరల్ పోలీస్ స్టేషన్‌కు శుక్రవారం ఉదయం వచ్చిన మూర్తి.. కొద్దిసేపు సిబ్బందితో మాట్లాడారు. అనంతరం బాత్‌రూమ్‌లోకి వెళ్లి తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. ఓ ఎస్ఐ.. పోలీస్ స్టేషన్‌లోనే ఆత్మహత్య చేసుకోవటం స్థానికంగా కలకలం రేపుతోంది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.