తెలంగాణలో పుష్ప-2 సినిమా విడుదల తర్వాత పరిస్థితులు కీలకంగా మారాయి. ముఖ్యంగా టాలీవుడ్ మీద సీఎం రేవంత్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. అసెంబ్లీ సాక్షిగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బెన్‌ఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని, టికెట్ల ధరలు పెంచేది లేదంటూ కీలక నిర్ణయాలు తీసుకోవటంతో.. హుటాహుటిన టాలీవుడ్ ప్రముఖులు సీఎంతో భేటీ అయ్యారు. అయితే.. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి అందులో నిజమెంతా..?