కేసీఆర్ పేరుతో తెలుగులో ఓ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. జబర్ధస్త్ ఫేం రాకింగ్ రాకేష్ నటిస్తూ నిర్మించిన ఈ సినిమా.. టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచీ ఏదో ఓ రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ సినిమా నవంబర్ 22న విడుదల కాగా.. రిలీజ్ తర్వాత కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందుకు కారణం.. తనను కీర్తిస్తూ బయోపిక్ తీయాలని కేసీఆరే స్వయంగా 20 కోట్లు ఇచ్చినట్టుగా రాకింగ్ రాకేష్ ఒప్పుకున్నట్టు.. ఓ వార్తాపత్రిక క్లిప్పింగ్ వైరల్ అవుతోంది. మరి ఆ క్లిప్పింగ్ నిజమేనా.. రాకేష్ ఆ విషయం ఒప్పుకున్నాడా..?