సహజీవనం చేసిన ఓ ప్రేమజంట తమకు పుట్టిన బిడ్డను వదిలించుకున్న హృదయవిదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్టు మండలానికి చెందిన గోవర్ధన్, యాచారానికి చెందిన ఓ యువతి ప్రేమించుకుని పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం మనస్పర్థలతో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత మనస్తాపంతో గోవర్ధన్ గత నెల ఆత్మహత్య చేసుకోగా.. యువతి వేరే పెళ్లి చేసుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు రంగంలోకి దిగి.. నెల రోజులుగా ఆచూకీ లేని ఆ పసికందును గుర్తించి అమీర్‌పేట శిశువిహార్‌కు అప్పగించారు.