తమ్ముడు చంద్రశేఖర్ ప్రేమ వివాహానికి అండగా నిలబడిన అన్న రాజశేఖర్‌ను మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణంగా హత్య చేశారు. యువతి సోదరుడు వెంకటేశ్, మరికొందరితో కలిసి రాజశేఖర్‌ను కిడ్నాప్ చేసి.. తీవ్రంగా కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేశాడు. ఈ ఘటనతో ఫరూఖ్‌నగర్, షాద్‌నగర్ ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. పరువు హత్యలు ఇప్పటికీ కొనసాగుతుండటంపై ఈ సంఘటన సమాజంలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.