ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో బుధవారం జరిగిన హత్య కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. శుక్రవారం రోజు డీఎస్పీ నాగరాజు ఈ వివరాలను విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. శ్రీను అనే వ్యక్తి హత్యకు గురికాగా.. శ్రీను భార్య, ఆమె తమ్ముడే ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. శ్రీను భార్యకు, ఆమె తమ్ముడి స్నేహితుడితో వివాహేతర సంబంధం కొనసాగుతోందని.. ఈ క్రమంలోనే భర్తను మరికొందరి సాయంతో కలిసి హత్య చేసినట్లు పోలీసులు వివరించారు.