తమ్ముడు మనోజ్‌కు విష్ణు ఇండైరెక్ట్ పంచ్

1 month ago 6
నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో విబేధాలు ఒక్కసారిగా వీధికెక్కాయి. మంగళవారం రాత్రి జరిగిన ఘర్షణ అనంతరం మోహన్‌బాబు ఆస్పత్రిలో చేరారు. ఈ పరిణామాలపై ఆయన పెద్ద కుమారుడు, నటుడు విష్ణు మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. కాంటినెంటల్‌ ఆస్పత్రిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. మమ్మల్ని అమితంగా ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు అని ఆయన అన్నారు. నిన్న జరిగిన దాడిలో ఒక విలేకరి గాయపడటం చాలా దురదృష్టకరం అన్నారు. అతని కుటుంబంతో మాట్లాడామని.. అవసరమైన సాయం చేస్తామని ఆయన తెలిపారు. ఇదే సమయంలో సోదరుడు మనోజ్‌కు కూడా పరోక్షంగా హెచ్చరికలు చేశాడు. ఏదైనా ప్రేమతో గెలవాలి కానీ ఇలా రచ్చకెక్కి గెలవలేరని అన్నారు. నేను నా కుటుంబం గురించి బయట మాట్లాడనని, మా నాన్న స్వయంకృషితో ఎదిగారన్నారు. ఇంట్లో ఉండొద్దని ఆయన అంటే.. ఉంటాను అనే హక్కు నాకు లేదని తేల్చిచెప్పారు.
Read Entire Article