ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలుచేసేందుకు టీడీపీ కూటమి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు.. సంక్షేమ పథకాల అమలుపై కీలక ప్రకటన చేశారు. మే నెలలో తల్లికి వందనం అమలు చేయనున్నట్లు తెలిపారు, అలాగే రైతులకు రూ.20 వేలు అందిస్తామని.. మత్స్యకారులకు రూ.20 వేలు అందించి అండగా ఉంటామన్నారు. మెగా డీఎస్సీని కూడా త్వరలోనే పూర్తి చేయనున్నట్లు చంద్రబాబు చెప్పారు.