ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం ములగలంపల్లిలో రమేష్ బాబు అనే ఉపాధ్యాయుడు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు వినూత్న ప్రచారం చేస్తున్నారు. మోటార్ బైక్‌కు మైక్ కట్టుకుని తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలను వివరిస్తున్నారు. ఉచిత విద్య, నాణ్యమైన భోజనం, యూనిఫామ్స్, డిజిటల్ తరగతులు వంటి అనేక సదుపాయాలను తెలియజేస్తూ తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు. ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే రమేష్ బాబు ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు.