తిరుపతి: కోళ్ల లారీ బోల్తా.. ఎగబడిన జనం..

1 hour ago 1
తిరుపతి జిల్లాలోని భాకరాపేట ఘాట్ రోడ్డులో సోమవారం అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరిగింది. ఓ కోళ్ల లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఘాట్ రోడ్డులోని మలుపు వద్ద బోల్తాపడటంతో.. లారీలోని కోళ్లన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. విషయం తెలుసుకున్న సమీప గ్రామస్తులు, ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు అక్కడికి చేరుకుని కోళ్లను తీసుకెళ్లేందుకు పోటీపడ్డారు. చేతికి దొరికినన్ని కోళ్లను ఎత్తుకెళ్లారు. అనంతరం డ్రైవర్ స్థానికుల సహాయంతో బోల్తా పడిన లారీని అక్కడి నుంచి తరలించారు.
Read Entire Article