శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడి వద్ద 7 కిలోల వెండి నాణేలు పట్టుబడటం సంచలనం రేపుతోంది. ఢిల్లీ వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రయాణికుడి లగేజీని చెక్ చేయగా.. అతడి బ్యాగులో భారీ మొత్తంలో వెండి నాణేలను గుర్తించారు. వాటికి సంబంధించిన బిల్లులు లేకపోవడంతో ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడికి వెండి నాణేలు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఢిల్లీకి ఎందుకు తరలిస్తున్నారు అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.