ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారుమూల పల్లెలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభవార్త వినిపించారు. రాష్ట్రంలోని మరో 158 గ్రామాలకు తొలిసారిగా రహదారి సౌకర్యం కల్పిస్తున్నారు. ఇందుకోసం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద రూ. 422.10 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో 347 కిలోమీటర్ల మేరకు.. 146 రోడ్లు, 19 వంతెనల నిర్మాణం చేపట్టనున్నారు. వీటి నిర్మాణంలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.