తిరుపతి జిల్లాలోని నాయుడుపేట ప్రాంతం పారిశ్రామిక కేంద్రంగా రూపుదిద్దుకుంటోందంటూ మంత్రి నారా లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. నాయుడుపేటలో ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ హౌసింగ్ ప్రాజెక్టు ప్రారంభించిన నేపథ్యంలో నారా లోకేష్ ఈ ట్వీట్ చేశారు. నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థతో పాటుగా పలు సంస్థలు ముందుకు వచ్చాయంటూ నారా లోకేష్ వాటి వివరాలను పంచుకున్నారు. పోర్టుకు సమీపంలో ఉండటం నాయుడుపేటకు కలిసివస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.