డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తిరుపతి పర్యటనలో నిరసన సెగ తగిలింది. కోట వినుత డ్రైవర్ రాయుడు కుటుంబంతో పాటుగా పలువురు తమ సమస్యలను పరిష్కరించాలంటూ తిరుపతి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలంటూ డ్రైవర్ రాయుడు కుటుంబసభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు డ్రైవర్ రాయుడు హత్య కేసు నాలుగు నెలల కింద తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోట వినుత అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు.