Manchu manoj at mohan babu university: తిరుపతిలోని మంచు మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తతలు తలెత్తాయి. మంచు మనోజ్, మౌనిక దంపతులు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే మంచు మనోజ్ వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్పటికే అక్కడకు చేరుకున్నారు. వారిని లోనికి అనుమతించలేదు. దీంతో మంచు మనోజ్ గేటు ముందు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే రాళ్లదాడి, తోపులాటలు జరిగాయి. అయితే పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. మంచు మనోజ్‍ను తాతయ్య, నాన్నమ్మ సమాధుల వరకూ అనుమతించారు.