తిరుపతి: రైల్వే బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన ఆక్సిజన్ ట్యాంకర్..

6 months ago 14
Oxygen tanker stuck under railway bridge Renigunta: రైల్వే బ్రిడ్జి కింద ఆక్సిజన్ ట్యాంకర్ చిక్కుకుపోయిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. తిరుపతి జిల్లా రేణిగుంటలోని రైల్వే బ్రిడ్జి వద్ద మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. దీంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. అయితే ఆక్సిజన్ ట్యాంకర్ లాంటి అత్యవసర సేవలు అందించే వాహనం చిక్కుకుపోవటంతో స్థానికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చూడాలని కోరారు.
Read Entire Article