Tirumala Temple Laddu: తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యతపై తీవ్ర చర్చ జరుగుతుండగా నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు ల్యాబ్ ఇచ్చిన రిపోర్టులో దిగ్భ్రాంతికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. తిరుమల లడ్డూ తయారీ కోసం వినియోగించిన నెయ్యి నాణ్యతా ప్రమాణాలు 20 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. ఈ కల్తీ నెయ్యిలో ఉండే ఆస్కారం ఉన్న పదార్థాలకు సంబంధించిన జాబితాను రిపోర్టులో పేర్కొంది. వాటిలో ఫిష్ ఆయిల్, జంతువుల కొవ్వు తదితర పదార్థాలు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.