Tirupati Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఇప్పటికే ఏపీ పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు అప్రమత్తమై.. దేవాలయాలలో తయారు చేసే ప్రసాదాల విషయంలో.. అందులో వాడే నెయ్యి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా.. ఇదే వరుసలో తెలంగాణ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు విజయ డెయిరీ నెయ్యిని వాడనున్నట్టు తెలంగాణ డెయిరీ డెలవప్‌మెంట్ సొసైటీ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ప్రకటించారు.