Tirupati Laddu Animal Fat: ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో అందించే శ్రీవారి లడ్డూ ప్రసాదంపై.. ఇప్పుడు సర్వత్రా వివాదం చెలరేగింది. లడ్డూ ప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో తీసిన నెయ్యితో తయారు చేశారంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అగ్గి రాజేస్తున్నాయి. ఈ వివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు బండి సంజయ్ స్పెషల్ రిక్వెస్ట్ కూడా చేశారు.