తిరుపతి ప్రజలకు టీటీడీ శుభవార్త చెప్పింది. ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మంగళవారం (డిసెంబర్ 3) నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. రేపు ఉదయం నుంచి టోకెన్లు కూడా జారీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో స్థానికుల కోటా దర్శనంపై టీటీడీ మార్గదర్శకాలు జారీ చేసింది. మహతి ఆడిటోరియంలో 2500, తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో మరో 500 టోకెన్లు ఇస్తారు. అలాగే ఒకసారి దర్శనం చేసుకుంటే మరో 3 నెలల పాటు దర్శనం అవకాశం ఉండదని టీటీడీ స్పష్టం చేసింది.