Tirupati Hyderabad IndiGo Flight In Air U Turn: ఏపీలోని రేణిగుంట ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు సాంకేతిక లోపాలతో నిలిచిపోయాయి. హైదరాబాద్ వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానం మొరాయించడంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇండిగో విమానంలో ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. విమానాన్ని వెనక్కి తిప్పి ల్యాండ్ చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా రీఫండ్ ఇస్తామని చెప్పడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.