తెలంగాణ నుంచి తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు తీపి కబురు. చర్లపల్లి-తిరుచానూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ప్రతి వారం ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుందని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి కేంద్రం తోడ్పాటునందిస్తుందని అందుకే రైల్వే బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. ఓట్ల ప్రక్షాళన ప్రక్రియ ద్వారా రోహింగ్యాల అనర్హమైన ఓట్లను ఖచ్చితంగా తొలగిస్తామన్నారు. దేశంలోనే అత్యధికంగా ఇంధనంపై వ్యాట్ విధిస్తున్న రేవంత్ సర్కార్.. కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు.