తిరుపతిలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించే సమయంలో.. బీపీ డౌన్ అయ్యి ఒక్కసారిగా పక్కకు వాలిపోయారు. అయితే పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది.. ఆనం కింద పడకుండా పట్టుకున్నారు. అనంతరం వైద్యులు ప్రాథమిక వైద్య చికిత్స అందించారు. అయితే తీవ్రమైన ఎండ, బీపీ తక్కువ కావటం వలన కొద్దిగా నీరసానికి గురైనట్లు మంత్రి ఆనం ప్రకటన విడుదల చేశారు.