పర్యావరణ పరిరక్షణతో పాటుగా ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలను అందించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల వినియోగానికి పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలోనే 2029 నాటికి రాష్ట్రంలో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులే నడిచేలా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే ఆధ్యాత్మిక నగరం తిరుపతికి 300 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయిస్తున్నారు. ఈ బస్సుల కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ టెండర్లు ఆహ్వానిస్తోంది.