తిరుపతిలో అపచారం జరుగుతోంది! తిరుపతి సెంట్రల్ బస్టాండ్‌లోని దుకాణాల్లో మాంసాహారం విక్రయిస్తున్నారు. ఇలాంటివి అమ్మొద్దని నిబంధలను ఉన్నా.. వాటిని చాలా మంది నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. కాగా, ఈ బస్టాండ్ ద్వారా రోజు వేల మంది భక్తులు రాకపోకలు సాగిస్తున్నారు. అలాంటి బస్టాండ్ ప్రాంగణంలో మాంసాహారం విక్రయంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే దీనిపై అధికారుల నిఘా కరువైందనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా అధిక ధరలతోనూ భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.