తిరుపతిలోని హాథిరాం బావాజీ మఠం కూల్చివేత నిర్ణయంపై బంజారా సమాజం నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నిర్ణయం వారి మనోభావాలను దెబ్బతీస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలను గౌరవించి, కూల్చివేత నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఆమె ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు.