తిరుపతిలో చంద్రబాబు, పవన్, టీటీడీ ఛైర్మన్ ఫోటోలకు పాలాభిషేకం

1 month ago 4
తిరుపతి టౌన్ క్లబ్ ద్గర ఎన్టీఆర్ విగ్రహానికి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఫోటోలకు కూటమి నేతలు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ పాలకమండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్సనం కల్పిస్తామని హామీ ఇచ్చారని.. ఇచ్చిన హామిీని మొదటి పాలకమండలి సమావేశంలోనే నెరవేర్చారన్నారు ఎమ్మెల్యే శ్రీనివాసులు. తిరుపతి నగరంలోని 6లక్షలమంది ప్రజలు టీటీడీ ఛైర్మన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారన్నారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు శ్రీవారి భక్తుల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని.. టిటిడి పాలకమండలి ఛైర్మన్ గా విలువలు కలిగిన వ్యక్తిని నియమించారన్నారు. సామాన్య భక్తుల సేవలోనే టీటీడీ పాలకమండలి పనిచేస్తుందన్నారు భానుప్రకాష్ రెడ్డి. శ్రీవారి దర్శనం కల్పించమని తిరుపతి స్థానికులు తనను కోరారని..గత ప్రభుత్వ హయాంలో రద్దయిన స్థానికులకు శ్రీవారి దర్శనాన్ని ప్రభుత్వం, పాలకమండలి తిరిగి ప్రారంభించిందన్నారు.
Read Entire Article