Tirumala Alipiri Leopard Sitting On Tree: తిరుమలకు వెళ్లే అలిపిరి నడకమార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. 2765 మెట్టు సమీపంలో ఓ చెట్టుపై చిరుత కూర్చుని ఉంది. చిరుతను చూసి భక్తులు భయాందోళనకు గురయ్యారు. టీటీడీ అధికారులు భక్తుల‌్ని గుంపులు గుంపులుగా అలిపిరి నడక మార్గంలో తిరుమలకు పంపిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలతో వెళుతున్నవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ నెలలోనే అలిపిరి నడకమార్గంలో చిరుత మూడుసార్లు సంచరించినట్లు చెబుతున్నారు.