కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు నెలవైన తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆగమ శాస్త్రాల ప్రకారం తిరుమల కొండ మీదుగా రాకపోకలు నిషేధమని భక్తులు, టీటీడీ ఎప్పటి నుంచో చెప్తోంది. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని టీటీడీ గతంలో అనేకసార్లు కేంద్రాన్ని కోరింది. తాజాగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు.. ఈ విషయమై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు లేఖ రాశారు.