తిరుమలలో భారీ ప్రమాదం తప్పింది. కారులో ఒంగోలుకు చెందిన భక్తులు తిరుమలకు వచ్చారు. వారు తమ కారును కొండపై కౌస్తుభం పార్కింగ్ ప్రాంతంలో నిలిపారు. దీంతో అక్కడ అకస్మాత్తుగా పొగలు రావడంతో.. వెంటనే భక్తులు దిగిపోయారు. తర్వాత కొద్దిసేపటికే కారులో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఆ కారు మొత్తం కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కారులో మంటలు చెలరేగడానికి ప్రధాన కారణం ఏసీ ఆన్ చేయడమే అని తెలుస్తోంది.