తిరుమల కొండపై మరో అపచారం.. రోజు గడవకముందే.. ఏంటిది గోవిందా!

1 year ago 55
తిరుమలలో అపచారం జరిగింది. తిరుమలలో అన్యమతానికి చెందిన వ్యక్తి నమాజ్ చేసిన ఘటన మరువకముందే మరో అపచారం జరిగింది. బాధ్యతగా ప్రవర్తించాల్సిన పోలీసులే.. మద్యం తాగి కొండపైకి చేరుకున్నారు. మద్యం మత్తులో తమ వాహనంతో మరో వాహనాన్ని ఢీకొట్టి హల్ చల్ చేశారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం కలకలం రేపింది. ముగ్గురు ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులు ఈ అపచారానికి పాల్పడ్డారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వీరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సమాచారం.
Read Entire Article