Tirumala Ghat Road Car Stunts: తిరుమల ఘాట్ రోడ్డులో యువకులు హల్చల్ చేశారు. తిరుమలకు వెళ్ళే సమయంలో సన్ రూఫ్, విండోల నుంచి నిలబడి సెల్ఫీలు దిగిన ఈ యువకుల చేష్టలు చూసి, ఇతర భక్తులు భయపడ్డారు. పెద్దగా కేకలు, అరుపులతో రెచ్చిపోయారు. అసలే వర్షం పడుతోంది.. ఇదే సమయంలో కారులో చేసిన స్టంట్స్ భయపెట్టాయి. యువకుల చేష్టలకు అందరూ అవాక్కయ్యారు. కొంతమంది ఈ యువకుల చేష్టల్ని మొబైల్స్‌లో రికార్డు చేశారు.