ఏపీలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే విజయవాడ నుంచి శ్రీశైలానికి సీప్లేన్ సర్వీసులు కూడా ప్రారంభించింది. వచ్చే ఏడాది నుంచి ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఇక శ్రీశైలాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఇందుకోసం మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సిద్ధమవుతోంది. మాస్టర్ ప్లాన్ రూపకల్పన కోసం అవసరమైన నివేదికలు అందజేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ను ఆదేశించగా.. నంద్యాల జిల్లా కలెక్టర్ అధికారులతో దీనిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. శుక్రవారంలోపు నివేదికలు అందజేయాలని ఆదేశించారు.