తిరుమలలో తలనీలాల సమర్పణలో ఏటికేడు కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. మే నెలలో గతంలో ఎన్నడూలేని విధంగా అత్యధిక మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. గత సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో రికార్డు స్థాయిలో తలనీలాల సమర్పణ జరిగినట్లు తెలిపింది. అలాగే భక్తుల రద్దీకి అనుగుణంగా కళ్యాణకట్టల వద్ద ఏర్పాట్లు చేశామని.. పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది.