తిరుమల దర్శనాలపై చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. తెలంగాణ ఎమ్మెల్యే

3 weeks ago 2
తిరుమల శ్రీవారి దర్శనాలకు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు చంద్రబాబు ఆమోదం తెలియజేయడం ఆనందంగా ఉందన్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. తెలంగాణ ప్రజాప్రతినిధులతో పాటు తెలంగాణ రాశులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని తాను ప్రస్తావించినప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి చంద్రబాబు నాయుడుకు ఉత్తరం రాశారని.. చంద్రబాబు కూడా వేగంగా స్పందించి పాలకమండలి ఏర్పడిన వెంటనే నిర్ణయం తీసుకున్నారన్నారు. 202 లో వైసీపీ ప్రభుత్వం కరోనా పేరుతో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులేఖలను రద్దు చేసిందన్నారు. అప్పట్లో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు గాని ముఖ్యమంత్రి గాని నోరు మెదపలేదన్నారు. కానీ ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పర సహకారంతో ముందుకు పోతున్నారన్నారు.
Read Entire Article