తిరుమలలో నెయ్యి కొరత ఏర్పడిందని.. శ్రీవారి కైంకర్యాలు, లడ్డూ తయారీలో అంతరాయం కలుగుతోందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. తిరుమలలో లడ్డూ కొరత లేదని.. అలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దంటూ శ్రీవారి భక్తులకు విజ్ఞప్తి చేసింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కావాల్సినంత నెయ్యి నిల్వలు తమ వద్ద ఉన్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో జరిగే ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరింది.