తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసును దర్యాప్తు చేస్తున్న సిట్.. కీలక విషయాలు వెల్లడించింది. వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు.. 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా అయినట్లు సిట్ గుర్తించింది. బోలేబాబా డెయిరీ ఈ నెయ్యిని సరఫరా చేసిందని పేర్కొన్నారు. నకిలీ నెయ్యి తయారీ కోసం పామాయిల్‌తో పలు రసాయనాలు వాడినట్లు సిట్ తేల్చింది. కాగా ఈ కల్తీ నెయ్యి ద్వారా బోలేబాబా డైరెక్టర్లు రూ. 251.53 కోట్లు ఆర్జించినట్లు సిట్ అధికారులు గుర్తించారు.