Pawan Kalyan Respond On Tirumala Laddu: తిరుమల లడ్డూ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపడం బాధాకరమన్నారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో పనిచేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. ఈ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని.. దేశంలోని దేవాలయాల సమస్యలను పరిశీలించేలా జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయాలని కోరారు. సనాతన ధర్మాన్ని అపవిత్రం చేయకుండా ఉండేలా కలిసి రావాలన్నారు.