తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో తెలంగాణలోని ఆలయాల్లో వినియోగించే నెయ్యి, ఇతర పదార్థాలను తనిఖీ చేసి ల్యాబ్‌కు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా.. లడ్డూలు, ప్రసాదాల తయారీకి ప్రభుత్వ పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలోని విజయ డెయిరీ నుంచే నెయ్యి, పాలను కొనుగోలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.