Yv Subba Reddy Petition On Vigilance Enquiry: టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం తనపై విజిలెన్స్ విచారణ జరపకుండా స్టే విధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. టీటీడీ చైర్మన్ హోదాలో తాను పలు అక్రమాలకు పాల్పడ్డానంటూ చేసిన ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు అవసరమైన డాక్యుమెంట్లను ఎస్పీ ఇవ్వడం లేదన్నారు. తనపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణను కొట్టేయాలని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ విచారణకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోర్టును కోరారు.